హైదరాబాద్ అథ్లెట్ బికాష్ కరార్‌కు వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో చోటు

August 21, 2026 12:04 PM
Hyderabad athlete Bikash Karar representing India in masters athletics

దేగూలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 3 వరకు పోటీలు
200 మీ., 400 మీ., 400 మీ. హర్డిల్స్‌లో బికాష్ కరార్ పోటీ

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన వెటరన్ అథ్లెట్, Athletic Coaching Academy, Hyderabad ఛైర్మన్ Bikash Karar కు అరుదైన అవకాశం దక్కింది.

దక్షిణ కొరియాలోని దేగూలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగే World Masters Athletics Championshipsలో భారత్ తరఫున పోటీ చేయనున్నారు.

మూడు విభాగాల్లో పోటీ

50 ఏళ్లు పైబడిన కేటగిరీలో Bikash Karar 200 మీటర్లు, 400 మీటర్లు, 400 మీటర్ల హర్డిల్స్ విభాగాల్లో పాల్గొంటారు. ఆయనకు OU ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం Senior Professor and Head Prof. Rajesh Kumar శిక్షణ ఇస్తున్నారు.

గతంలోనూ అంతర్జాతీయ పోటీలు

బికాష్ కరార్ గతంలో ఫిన్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్ తదితర దేశాల్లో జరిగిన World Masters Athletics పోటీల్లో కూడా పాల్గొన్నారు. తాజాగా దేగూలో జరిగే ఛాంపియన్‌షిప్స్‌కు ఎంపిక కావడంతో మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media