సోనాలి బింద్రే కుమారుడిని చూశారా? హృతిక్ రోషన్‌లా ఉన్నాడంటూ నెటిజన్ల కామెంట్స్

August 22, 2026 12:44 PM
Sonali Bendre with her son Ranveer at a public event

స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు
తెలుగు సినీ ప్రేక్షకులకు సోనాలి బింద్రే సుపరిచితమే

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వందలాది సినిమాలు చేసిన సోనాలి బింద్రే 1990-2000 దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు.

తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు.

మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనాలి.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు.

ఆ సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం

హిందీలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలతోనూ సోనాలి బింద్రే కలిసి నటించారు.

హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్ డైరెక్టర్ గోల్డీ బెహిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు.

2013లో ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కొన్ని సినిమాల్లోనూ నటించారు.

క్యాన్సర్‌ను జయించిన సోనాలి

సెకండ్ ఇన్నింగ్స్‌లో ఉన్న సమయంలో సోనాలి బింద్రే జీవితంలో అనుకోని కుదుపు ఎదురైంది.

ఆమె బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడారు. అయితే సడలని ఆత్మవిశ్వాసం, సంకల్పంతో ఆ మహమ్మారిని విజయవంతంగా జయించారు.

ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లలో సహాయక పాత్రల్లో బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన రాఖ్ వెబ్ సిరీస్ ఓటీటీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

హృతిక్ రోషన్‌లా ఉన్నాడంటూ కామెంట్స్

సోనాలి బింద్రేకు రణవీర్ అనే కుమారుడు ఉన్నారు.

సినిమా ఈవెంట్లు, ఇతర కార్యక్రమాలకు ఆమె తరచూ కుమారుడితో కలిసి హాజరవుతుంటారు.

తాజాగా రణవీర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మంచి హైట్, శరీర సౌష్టవంతో కనిపిస్తున్న రణవీర్‌ను చూసిన నెటిజన్లు.. ఆయన హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్‌లా కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాల్లోకి వస్తే కచ్చితంగా మంచి హీరో అవుతాడని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం రణవీర్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media