ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారిపై ప్రమాదం
కారు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి.. చికిత్స పొందుతూ మరొకరు మృతి
ఖమ్మం: జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు మైనర్లు (Two Minors) మృతి చెందారు.
బంధువుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. :
పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని గ్రీన్ కాలనీకి చెందిన ( Two minors) గుండేటి శ్రీనివాస్ (18), ఖమ్మం నగరంలోని రామనగుట్ట ప్రాంతానికి చెందిన తన బంధువు గర్లపాటి రిషిక (10)తో కలిసి బైక్‌పై కాలనీకి వెళ్తున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వారి బైక్‌ను ఢీకొట్టింది.
రిషిక అక్కడికక్కడే మృతి:
కారు ఢీకొనడంతో గర్లపాటి రిషిక (10) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన శ్రీనివాస్‌ను ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
కేసు నమోదు:
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.



