కోనసీమ మత్స్యకారుల ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు.. 21 రోజులైనా జాడేదీ?

August 24, 2026 3:32 PM

సముద్రంలోకి వెళ్లి 21 రోజులు.. ఇంకా ఇంటికి చేరని ఏడుగురు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఆగస్టు 3న అల్లవరం ఓడల రేవు నుంచి బోటులో వేటకు వెళ్లారు. 21 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఇంటికి చేరలేదు.

వారి బోటు ఆచూకీ కూడా లభించలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

బోటు కోసం కోస్ట్‌గార్డు గాలింపు

మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు సముద్రంలో గాలింపు చేపట్టారు.

డ్రోన్లు, కోస్ట్ గార్డు నౌకలతో వెతికినా ఇప్పటి వరకు బోటు లేదా మత్స్యకారుల ఆనవాళ్లు కనిపించలేదు.

తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు గాలింపు కొనసాగించినా ఫలితం లేకపోయింది.

సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందన

మత్స్యకారుల అదృశ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.

అధికారులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

దీంతో కలెక్టర్ స్థాయి నుంచి సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. మెరైన్ అధికారులతోనూ సమన్వయం చేశారు.

మత్స్యకారుల ఆచూకీ కోసం కేంద్ర హోం శాఖ సహాయాన్ని మెరైన్ అధికారులు కోరారు.

విదేశీ జలాల్లో కోనసీమకు చెందిన బోటు, మత్స్యకారులకు సంబంధించిన సమాచారం లభిస్తే వెంటనే తెలియజేయాలని కోరారు.

మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంకతో సంప్రదింపులు

మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలను సంప్రదించాలని కోస్ట్ గార్డ్, భారత నౌకాదళ అధికారులు కేంద్ర హోం శాఖకు సూచించారు.

బోటు మరమ్మతులకు గురై ఉంటే సముద్ర ప్రవాహాలు, గాలి కారణంగా మయన్మార్ లేదా అండమాన్ నికోబార్ దీవుల వైపు వెళ్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media