జెర్సీపై టేప్‌తో కనిపించిన వైభవ్
15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ‘ఈస్ట్ జోన్’ తరఫున ఆడుతున్నాడు.
ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో వైభవ్‌కు ఇదే తొలి మ్యాచ్.
అరంగేట్ర మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను 8 పరుగులు చేసి అవుటయ్యాడు.
అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు ఉన్నాయి.
అయితే వైభవ్ బ్యాటింగ్ కంటే అతని జెర్సీ నంబర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అతని జెర్సీపై టేప్ కనిపించింది. జెర్సీ నంబర్ రెండంకెల సంఖ్యగా ఉండి ‘3’తో ముగుస్తోంది.
అయితే ఆ సంఖ్యలోని మొదటి అంకెను టేప్‌తో కప్పి ఉంచాడు.
దీంతో వైభవ్ ఇలా ఎందుకు చేశాడనే చర్చ మొదలైంది.
ఐపీఎల్‌లో మాత్రం జెర్సీ నంబర్ 3
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు.
ఆ జట్టులో అతను 3వ నంబర్ జెర్సీ ధరిస్తాడు.
దీంతో దులీప్ ట్రోఫీలో తనకు నచ్చిన జెర్సీ నంబర్ దక్కలేదా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వైభవ్‌కు మొదట వేరే జెర్సీ నంబర్ కేటాయించి ఉండొచ్చని, అందులోని ఒక అంకెను టేప్‌తో కప్పి ‘3’గా కనిపించేలా చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే జెర్సీపై టేప్ ఎందుకు అంటించాడనే విషయంపై వైభవ్ నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.
భారీ ఇన్నింగ్స్‌పై వైభవ్ కన్ను
నార్త్-ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తన జట్టు విజయం సాధించాలని వైభవ్ కోరుకుంటున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే భారీ ఇన్నింగ్స్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసింది.
షాబాజ్ అహ్మద్ 167 పరుగులు చేయగా, సుదీప్ కుమార్ ఘరామి 146 పరుగులు సాధించాడు.



