తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు త్వరలోనే శుభవార్త అందనుంది.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ TGPSC మరో 15 ఉద్యోగ ప్రకటనలను వరుసగా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
ఈ నెలాఖరు నుంచి లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి నోటిఫికేషన్లు విడుదల చేసే దిశగా కమిషన్ తుది కసరత్తు చేస్తోంది.
నెలకు రెండు లేదా మూడు నోటిఫికేషన్లు చొప్పున వరుసగా విడుదల చేసేందుకు అవసరమైన పాలనాపరమైన ప్రక్రియను కూడా పూర్తి చేసింది.
ఫారెస్ట్, ఇంజినీరింగ్ విభాగాల్లో భారీ పోస్టులు
ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన 3,800 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు TGPSCకి చేరాయి. ఇందులో అత్యధికంగా 1,398 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
వీటితో పాటు ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు వంటి ప్రొఫెషనల్ విభాగాల్లోనూ భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోస్టుల సంఖ్య, అర్హతలు తదితర వివరాలను మరోసారి పరిశీలించిన తర్వాత కమిషన్ నోటిఫికేషన్లకు ఆమోదం తెలపనుంది.
CBT విధానంలో పరీక్షలు.. వెంటనే మార్కులు
ఈసారి ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు TGPSC కీలక మార్పులు చేస్తోంది.
సాధ్యమైనంత వరకు అన్ని పోటీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ విధానంలో పరీక్ష పూర్తయిన వెంటనే అభ్యర్థులు తమ మార్కులను స్క్రీన్‌పై చూసుకునే అవకాశం ఉంటుంది.
దీంతో ఫలితాల వెల్లడిలో ఆలస్యం తగ్గడంతో పాటు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.



