నేపాల్ వరదల్లో ఇషా ఫౌండేషన్ సభ్యులు మృతి
నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా తమ యాత్రా బృందానికి చెందిన 80 మంది ఇషా ఫౌండేషన్ సభ్యులను కోల్పోయామని సద్గురు జగ్గా వాసుదేవ్ తెలిపారు.
బుధవారం చోటుచేసుకున్న ఘటనను గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
9 నిమిషాల్లోనే ఊహించని విషాదం
టిబెట్-నేపాల్ సరిహద్దులో వరద బీభత్సం భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమైంది.
Sadhguru Jaggi Vasudev ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఆకస్మిక వరదలు సృష్టించిన విధ్వంసం తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలే కనిపిస్తున్నాయి.
ఈ విపత్తు భయానకమైనది, అసాధారణమైనది. కైలాష్ మానససరోవర్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న మా బృందం వరదల్లో కొట్టుకుపోయింది.
ఈ ఘటనలో ఇషా సభ్యులైన 80 మందిని కోల్పోయాం’ అని సద్గురు చెప్పారు.
యాత్రా బృందం నాయకుడు ఇషాంగ ప్రవీణ్ ఉదయం 9:05 గంటలకు తాము ఇమ్మిగ్రేషన్ సెంటర్కు చేరుకున్నట్లు తనకు సందేశం పంపారని సద్గురు తెలిపారు.
ఆ తర్వాత కేవలం 9 నిమిషాల్లోనే వరదలు విధ్వంసం సృష్టించాయని చెప్పారు.
‘వారం క్రితం నేను ఉన్న ఇమ్మిగ్రేషన్ సెంటర్.. ఇప్పుడు వరదల్లో కొట్టుకుపోయింది’ అని సద్గురు కన్నీటిపర్యంతమయ్యారు.
గైరాంగ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి
వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న గైరాంగ్ ప్రాంతానికి వెళ్లేందుకు తనను అనుమతించాలని భారత, చైనా దౌత్య కార్యాలయాలను సద్గురు కోరారు.
ఇషా సేక్రెడ్ వాక్స్ ఆధ్వర్యంలో కైలాష్ మానససరోవర్ యాత్ర నుంచి బుధవారం తిరిగి వస్తుండగా పలువురు గల్లంతయ్యారు.
గల్లంతైన వారిలో భారత సంతతికి చెందిన అమెరికా దంపతులు దీపక్ ఆహుజా, మధు ఆహుజా కూడా ఉన్నారు.



