బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ ఊరట లభిస్తోంది.
గత వారం బంగారం ధరలు భారీగా పెరగగా.. ఈ వారం మాత్రం వరుసగా తగ్గుతూ వస్తున్నాయి.
గత నాలుగు రోజుల్లోనే బంగారం ధర ఏకంగా రూ.9 వేల మేర తగ్గింది.
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో గోల్డ్, సిల్వర్ రేట్లలో మార్పులు కనిపిస్తున్నాయి.
డాలర్ మళ్లీ బలం పుంజుకోవడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేవారికి ఈ ధరల తగ్గుదల ఊరటనిస్తోంది.
సెప్టెంబర్ 3న గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
గురువారం బంగారం ధరలు
బంగారం ధరల్లో పతనం కొనసాగింది. గురువారం కూడా ధరలు భారీగా తగ్గాయి.గంటల వ్యవధిలోనే గోల్డ్ రేట్లలో మార్పులు కనిపిస్తున్నాయి.
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,52,010 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల రేటు రూ.1,39,340గా ఉంది.
- విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,010గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,39,340గా కొనసాగుతోంది.
- చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,010గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,340గా ఉంది.
- బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,52,010గా పలుకుతోంది. 22 క్యారెట్ల రేటు రూ.1,39,340గా ఉంది.
- ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,160గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,490గా ఉంది.
సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
వెండి ధరల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ.2,44,900గా ఉంది.
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది.
- చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2,49,900గా కొనసాగుతోంది.
- బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది. నిన్న ఈ ధర రూ.2.45 లక్షలుగా ఉంది.



