భారీ బ్యాటరీతో Honor X9e Pro
- Honor X9e Proలో 11,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ ఉన్నాయి.
- 6.8 అంగుళాల LTPS AMOLED డిస్‌ప్లే, 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ లభిస్తున్నాయి.
- 108MP కెమెరా, Snapdragon 6 Gen 5 చిప్‌సెట్, 8GB RAM, 256GB/512GB స్టోరేజ్ ఉన్నాయి.
Honor X9e Pro: భారీ బ్యాటరీ.. పవర్ బ్యాంక్‌గా కూడా వాడొచ్చు
స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కోరుకునే వారికి Honor కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. Honor X9e Pro స్మార్ట్‌ఫోన్‌ను మలేషియాలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఏకంగా 11,000mAh బ్యాటరీని ఇచ్చారు. దీంతో ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
11,000mAh బ్యాటరీ..
Honor X9e Proలో 11,000mAh బ్యాటరీ ఉంది. సిలికాన్-కార్బన్ యానోడ్ టెక్నాలజీతో ఈ స్థాయి బ్యాటరీ సామర్థ్యాన్ని సాధించినట్లు Honor చెబుతోంది.
ఇది కూడా చదవండి
ఫోన్ స్క్రీన్ అవసరం లేదు.. కళ్ల ముందే AI టెక్నాలజీ.. Samsung Galaxy Glasses ఎప్పుడు?
కంపెనీ ల్యాబ్ పరీక్షల ప్రకారం.. 164 గంటలకు పైగా మ్యూజిక్ స్ట్రీమింగ్, 35 గంటల షార్ట్ వీడియో ప్లేబ్యాక్, 66 గంటలకు పైగా సాధారణ వీడియో ప్లేబ్యాక్ చేయొచ్చు. రోజుకు సగటున 6 గంటల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆరు సంవత్సరాల వరకు బ్యాటరీ ఆరోగ్యం ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఛార్జింగ్ కోసం 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ద్వారా ఇతర పరికరాలకు కూడా పవర్ ఇవ్వొచ్చు.
10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే
ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల LTPS AMOLED డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. డిస్‌ప్లే పీక్ బ్రైట్‌నెస్ 10,000 నిట్స్ వరకు ఉంటుంది. అయితే మొత్తం స్క్రీన్‌పై నిరంతరం ఈ స్థాయి బ్రైట్‌నెస్ ఉండదు. HDR వీడియో ప్లేబ్యాక్ సమయంలో స్క్రీన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 10,000 నిట్స్ వరకు చేరుతుందని Honor వివరించింది.
108MP కెమెరా.. Snapdragon చిప్‌సెట్
కెమెరాల విషయానికి వస్తే ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక 108MP ప్రధాన కెమెరాతో పాటు 5MP అల్ట్రావైడ్ కెమెరా ఇచ్చారు.
పనితీరు కోసం Snapdragon 6 Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 8GB RAMతో పాటు 256GB లేదా 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP69K రేటింగ్ లభించింది. 100,000 సార్లు నీటిలో ముంచే పరీక్షలు నిర్వహించినట్లు కంపెనీ చెబుతోంది.
ధర, కలర్ ఆప్షన్లు
Honor X9e Pro Android 16 ఆధారిత MagicOS 10పై పనిచేస్తుంది. Royal Purple, Reddish Brown, Dawn Gold, Midnight Black రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
మలేషియాలో 8GB+256GB వేరియంట్ ధర MYR 1,899 (సుమారు $464)గా ఉంది. 512GB వేరియంట్ ధర MYR 2,399 (సుమారు $587)గా నిర్ణయించారు.

