ఐశ్వర్యా రాయ్‌కు బాడీగార్డ్‌గా పనిచేసిన నటుడు, బాడీబిల్డర్ కేతన్ కరాండే
బాలీవుడ్లో ఒకప్పుడు సెన్సేషన్‌గా నిలిచిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ ప్రేమ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాలను నటుడు, బాడీబిల్డర్ కేతన్ కరాండే తాజాగా బయటపెట్టారు.
అప్పట్లో ఐశ్వర్యా రాయ్‌కు బాడీగార్డ్‌గా పనిచేసిన ఆయన.. తనకు ఎదురైన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
సల్మాన్ ఖాన్ నుంచి ఐశ్వర్యకు రక్షణ కల్పించేందుకే తనను నియమించారని వెల్లడించారు.
‘ఆర్ట్ మీడియా ఎంటర్టైన్మెంట్’ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతన్ ఈ విషయాలు పంచుకున్నారు.
ఎన్డీటీవీ కథనం ప్రకారం.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఐశ్వర్య ‘కుచ్ నా కహో’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటనలు జరిగాయి.
ఐశ్వర్యకు బాడీగార్డ్‌గా కేతన్ కరాండే
ఆ సమయంలో ఐశ్వర్యా రాయ్ భద్రత బాధ్యతలను కేతన్ కరాండే చూసుకునేవారు.
ఐశ్వర్యను ఇంటి నుంచి షూటింగ్ ప్రదేశాలకు కారులో సురక్షితంగా తీసుకెళ్లడం తన ప్రధాన బాధ్యత అని చెప్పారు.
అప్పట్లో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ మధ్య సంబంధాలు సరిగా లేవని తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఐశ్వర్యకు రక్షణ కల్పించేందుకు తనను బాడీగార్డ్‌గా నియమించినట్లు కేతన్ వెల్లడించారు.
కారు ముందు వచ్చి నిలబడిన సల్మాన్ ఖాన్
ఓ ఫ్యాషన్ షో తర్వాత జరిగిన ఘటనను కేతన్ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.
ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్ నిర్వహించిన ఫ్యాషన్ షో ముగిసిన తర్వాత ఐశ్వర్యతో కలిసి తాము కారులో బయల్దేరామని చెప్పారు.
అదే సమయంలో సల్మాన్ ఖాన్ అకస్మాత్తుగా కారు ముందుకు వచ్చి నిలబడ్డారని తెలిపారు. దీంతో కారులో ఉన్నవారంతా ఒక్కసారిగా భయపడిపోయారని వివరించారు.
ఆ సమయంలో తాను కారు దిగేందుకు ప్రయత్నించానని కేతన్ చెప్పారు. అయితే డ్రైవర్ తనను ఆపారని తెలిపారు. పరిస్థితిని గమనించిన డ్రైవర్ వెంటనే కారును పక్కకు తిప్పి వేగంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని గుర్తుచేసుకున్నారు.
ఈ ఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిందని కేతన్ తన ఇంటర్వ్యూలో వివరించారు.
సల్మాన్ వద్ద ఆయుధం ఉందని అనుకున్నా..
ఆ సమయంలో సల్మాన్ ఖాన్ వద్ద ఆయుధం ఉండవచ్చని తాను భావించినట్లు కేతన్ సంజ్ఞల ద్వారా తెలిపారు. అయితే ఈ విషయంలో ఆయన ఎలాంటి ఆధారాలను వెల్లడించలేదు.
ఆ ఘటన తనను తీవ్రంగా ఆలోచింపజేసిందని చెప్పారు. తాను అప్పటికే బాడీబిల్డింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టానని వివరించారు. ఇలాంటి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు.
మరుసటి రోజే ఉద్యోగానికి గుడ్‌బై
ఈ ఘటన తర్వాత ఐశ్వర్యకు బాడీగార్డ్‌గా కొనసాగకూడదని కేతన్ నిర్ణయించుకున్నారు. ప్రేమించుకున్న ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో తాను ఎందుకు ఇరుక్కోవాలని భావించినట్లు చెప్పారు.
శారీరక ఘర్షణలకు దూరంగా ఉండాలనుకున్నానని వివరించారు. అందుకే మరుసటి రోజే ఆ ఉద్యోగాన్ని వదిలేసినట్లు వెల్లడించారు.
సల్మాన్, ఐశ్వర్య స్పందన ఏమిటి?
కేతన్ కరాండే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ మధ్య గతంలో జరిగిన పరిణామాలపై మరోసారి ఆసక్తి పెరిగింది.
అయితే కేతన్ వెల్లడించిన విషయాలపై ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ లేదా ఐశ్వర్యా రాయ్ స్పందించలేదు. వారి నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.



