ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతినిధి పర్వతనేని హరిష్ శుక్రవారం జమ్మూ-కశ్మీర్‌పై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జమ్ము కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగం అనీ, దీని మీద మరో మాట లేనే లేదని తేల్చి చెప్పారు.
భారతీయ కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్‌ను పాకిస్థాన్ అనవసరంగా ప్రస్తావించిందని హరీష్ అన్నారు. ఎంత మొత్తుకొన్నా జమ్ము కాశ్మీర్ భూ భాగం పూర్తిగా భారత్ సొంతం అని స్పష్టం చేశారు.
Bharath Counter: జమ్మూ-కశ్మీరుపై పాకిస్తాన్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
