ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. అక్కడ కొందరు ఉన్మాదులు రెచ్చిపోయి, ఆడపిల్లలను టీజ్ చేశారు. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ అంశం మీద అక్కడ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాధను కలిగిస్తున్నాయి. మహిళా క్రికెటర్లు ధరించిన దుస్తులతోనే ఈ పరిస్థితి వచ్చిందని అక్కడ ఇండోర్ నేతలు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మహిళా సంఘాలు ఖండిస్తున్నాయి.
