దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించి తాాజా ప్రెస్ మీట్ కేంద్రంగా నిలుస్తోంది.
అయితే ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించడమే అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఓటర్ల జాబితాల్లో తప్పులు, డూప్లికేట్ ఎంట్రీలు, చిరునామా గందరగోళం, యువ ఓటర్ల నమోదు లోపం వంటి అంశాలు గత రెండు సంవత్సరాలుగా తరచుగా వెలుగులోకి వస్తున్నాయి.ఓటర్ల జాబితా సవరణను ఈ దశలో ప్రారంభించడం, ముఖ్యంగా 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం గమనించాల్సిందే.
తొలి దశలో సవరణ 10 నుంచి 15 రాష్ట్రాల్లో మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తద్వారా త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో సంస్కరణలు చేపట్టబోతున్నారు.
