మీర్పేట్ లో మరణం:భార్యే సూత్రధారి

October 27, 2025 5:47 PM

హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధాన్ని అడ్డుకోవడానికి భార్య తన భర్తను హత్యచేసింది. ప్రారంభంలో ప్రమాదవశాత్తు చనిపోయాడని నటించి మృతదేహాన్ని దాచేందుకు ప్రయత్నించిన ఆమె చివరకు పోలీసులు జైలు కి తీసుకొనివెళ్ళారు.
పోలీసుల వివరాల ప్రకారం, జిల్లెలగూడ ప్రగతినగర్ కాలనీలో నివాసమున్న అల్లంపల్లి విజయకుమార్ (42), తన భార్య సంధ్యతో ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు. విజయకుమార్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటే, సంధ్య మీర్‌పేట్ మునిసిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా ఉన్నది. ఈ మధ్య సంధ్య తన సహఉద్యోగి తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయాన్ని భర్త తెలుసుకోవడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల విజయకుమార్ మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి హెచ్చరిస్తూ వివాహేతర సంబంధం ఉన్న ఉద్యోగిని ఆపడానికి ప్రయత్నించాడు.
భర్త తన బంధానికి అడ్డుపడుతాడని భావించిన సంధ్య, ఈ నెల 20న (సోమవారం) బకెట్ తాడుతో భర్త మెడను బిగించి, కర్రతో తలపై కొట్టి హత్య చేసింది. తరువాత మృతదేహాన్ని బాత్రూమ్ వద్ద ఉంచి, ప్రమాదవశాత్తు చనిపోయాడని నటించి కుటుంబ సభ్యులను మోసం చేసింది. వెంటనే విజయకుమార్‌ను ఆస్పత్రికి తరలించారు, కానీ వైద్యులు ఆయన మరణాన్ని ధ్రువీకరించారు.మృతదేహాన్ని ఇంటికి తీసుకొని అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా, బకెట్ తాడుపై రక్తం మరకలు కనిపించడంతో, స్థానికులు అనుమానం వ్యక్తం చేసి మీర్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి వచ్చి కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నివేదిక మెడకు తాడు బిగించడం వల్లే మరణం అయినట్టు తేల్చింది. అనంతరం సంధ్యను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు, ఆమె నేరాన్ని అంగీకరించిందని వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media