తమిళ సినిమా ప్రపంచంలో ఇటీవల చర్చనీయాంశంగా మారిన ఒక చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసిందని ఆరోపణలు ఎదుర్కొన్న ఈ చిత్రం, విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. టీజర్ విడుదలైనప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తగా, సినిమా కారణంగా కొంతమంది వ్యక్తులపై దాడులు కూడా జరిగినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విషయం కోర్టు దాకా వెళ్లింది. చివరికి, కొన్ని సన్నివేశాలను తొలగించిన తరువాత సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది.
ఈ చిత్రానికి నిర్మాతగా ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ వ్యవహరించడం,ఆచారాలు, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఒక పద్ధతి కుటుంబానికి చెందిన టీనేజ్ అమ్మాయి రమ్య తనకు సరైన జీవిత భాగస్వామిని వెతుక్కుంటుంది. కానీ కుటుంబ ఆంక్షలు, సమాజపు కట్టుబాట్లు ఆమె జీవితాన్ని సంక్లిష్టం చేస్తాయి. ఆ పరిస్థితుల్లో రమ్య తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందనేది చిత్ర కథాంశం.
ఈ వివాదాస్పద చిత్రం నవంబర్ 4 నుంచి జియో హాట్‌స్టార్‌లో (Jio Hotstar) స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
