Champion Gukesh: హికారు నకమురాపై ఘన విజయం సాధించిన ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్

October 28, 2025 5:01 PM

ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ డొమ్మరాజు మరోసారి భారత గర్వకారణమయ్యాడు. అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురా పై జరిగిన

USA vs India ప్రదర్శన మ్యాచ్‌లో గుకేశ్‌ను ఓడించిన తర్వాత నకమురా, ఆయన రాజును(king in chess) ప్రేక్షకుల మధ్యకు విసరడంతో పెద్ద వివాదం చెలరేగింది. అదే నకమురాపై గుకేశ్ ఈసారి ప్రతీకార విజయాన్ని సాధించారు.తాజా మ్యాచ్‌లో గుకేశ్ ప్రశాంతమైన, క్రమశిక్షణతో కూడిన ఆటతీరు ప్రదర్శించి, రాగోజిన్ వెరియేషన్లో ఆడిన తెలివైన కదలికలతో నకమురాను ఓడించారు. రెండో గేమ్ డ్రాగా ముగిసినా, మొదటి గేమ్ విజయంతో గుకేశ్ టోర్నమెంట్ లీడర్‌గా నిలిచారు.

Clutch Chess: Champions Showdownలో మొత్తం 18 రాపిడ్ గేమ్స్ జరుగుతున్నాయి. ప్రతి గేమ్‌కు 10 నిమిషాల సమయం, 5 సెకన్ల ఇన్క్రిమెంట్ ఇవ్వబడింది. గెలుపులకు రోజురోజుకీ పాయింట్లు పెరుగుతున్నాయి — మొదటి రోజు 1 పాయింట్, రెండో రోజు 2, మూడో రోజు 3 పాయింట్లు.మొత్తం USD 4.12 లక్షల డాలర్ల బహుమతి నిధి ఉన్న ఈ టోర్నీలో విజేతకు Champion’s Jackpot కూడా లభిస్తుంది.

ప్రస్తుతం గుకేశ్ 6 గేమ్స్‌లో 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత మాగ్నస్ కార్ల్‌సెన్ (3.5 పాయింట్లు) రెండో స్థానంలో, హికారు నకమురా (3 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media