Adulterated:కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అరెస్ట్

October 30, 2025 10:20 AM

కల్తీ నెయ్యి కేసులో రాజకీయ రంగు ఎక్కుతోంది. వైవి సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) అప్పన్నను ఎస్ఐటీ అధికారులు గత రాత్రి అరెస్టు చేశారు. విచారణలో సహకరించలేదన్న కారణంగా ఎస్ఐటీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుని, గురువారం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది.విచారణ అనంతరం కోర్టు అప్పన్నకు14 రోజుల న్యాయహిరాసత్ (రిమాండ్) విధించింది. ఇది కల్తీ నెయ్యి కేసులో తొలి రాజకీయ అరెస్ట్ కావడం గమనార్హం.గతంలో ఎస్ఐటీ విచారణను వ్యతిరేకిస్తూ అప్పన్న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2024 ఎన్నికలు ముగిసే వరకు అప్పన్న, వైవి సుబ్బారెడ్డి పీఏగా పనిచేశారు. అంతకుముందు ఆయన ఢిల్లీలోని ఏపి భవన్‌లో ప్రోటోకాల్ ఓఎస్‌డీగా విధులు నిర్వర్తించారు.ఈ అరెస్ట్‌తో కల్తీ నెయ్యి కేసు మరో మలుపు తిరిగినట్లైంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media