చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో చిత్తూరు జిల్లా కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. 9వ అదనపు జిల్లా జడ్జి డాక్టర్ ఎన్. శ్రీనివాసరావు ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించారు.
తీర్పు సమయంలో న్యాయమూర్తి మాట్లాడుతూ, “ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన ఈ దాడి ప్రజాస్వామ్య వ్యవస్థపైనే దెబ్బ” అని పేర్కొన్నారు.
చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకట చలపతి అలియాస్ ములబాగల్ వెంకటేశ్, జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్, గంగన్నపల్లి వెంకటేశ్.2015 నవంబర్ 17న చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దుండగులు బురఖా ధరించి కత్తులు, తుపాకులతో దాడి చేసి అనురాధను కాల్చి చంపగా, భర్త మోహన్‌ను కత్తులతో పొడిచి హతమార్చారు.ఈ కేసులో మొత్తం 23 మందిని అరెస్ట్ చేయగా, 16 మందిని నిర్దోషులుగా, ఐదుగురిపై నేరం రుజువైనట్లు కోర్టు తేల్చింది.
దాదాపు పది సంవత్సరాల తర్వాత, ఈ హత్య కేసులో కోర్టు ఉరిశిక్ష విధిస్తూ చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
