మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో, ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసింది. కేసు సంబంధిత సురక్షిత మహిళ, కుటుంబ భద్రత అంశాలను ప్రధానంగా గుర్తించి తీర్పు ఇచ్చింది.అసలు కేసు ఏంటి మైనర్ బాలికపై దాడి జరిగి, నిందితుడికి ట్రయల్ కోర్టు పదేళ్ల కఠిన జైలు మరియు ఐదేళ్ల అదనపు శిక్ష విధించింది.అనూహ్య పరిణామం లో 2021లో బాధితురాలు నిందితుడితో వివాహం చేసుకున్నారు, ప్రస్తుతం ఏడాదిని గల కుమారుడు ఉన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు: “నేరం కామంతో కాదు, ప్రేమతో జరిగింది. నిందితుడిని జైలులో ఉంచితే, బాధితురాలికి, పసిబిడ్డకు, సమాజానికి నష్టం జరుగుతుంది” అని పేర్కొంది.తీర్పులో నిందితుడికి భార్యాబిడ్డలను గౌరవంగా సంరక్షించాలి అనే కఠిన షరతు విధించారు. ఈ నిర్ణయం ప్రత్యేక పరిస్థితులకు మాత్రమే వర్తిస్తుందని, ఇతర కేసులకు ఉదాహరణగా పరిగణించరాదని స్పష్టత ఇచ్చారు.
