ప్రముఖ నటి తమన్నా భాటియా తన వ్యక్తిగత జీవితం, సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “అబద్ధాలు చెప్పే వారిని నేను అస్సలు భరించలేను” అని స్పష్టం చేశారు.
“ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటాను, కానీ అబద్ధం చెప్పడం మాత్రం అసహ్యం” అని తమన్నా తెలిపారు. “మన ముఖం మీద అబద్ధం చెబుతూ, మనం నమ్ముతామనుకోవడం అసలు అవమానం” అని ఆమె చెప్పింది.
గతంలో నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నట్లు తెలిసిన విషయం. తాజాగా వీరిద్దరి మధ్య వ్యాగతిగత మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా వ్యాఖ్యలు బంధంలో నిజాయతీ, విశ్వాసం పట్ల ఆమె ఉన్న విలువను మరోసారి స్పష్టం చేశాయి.
