ఖర్గే మాట్లాడుతూ, దేశంలో శాంతిభద్రతల సమస్యలకు ఆరెస్సెస్, బీజేపీ భావజాలమే కారణమని ఆరోపించారు. “ఆరెస్సెస్ భావజాలం విషంతో సమానం. మహాత్మా గాంధీ హత్యకు దారితీసిన వాతావరణం ఆ సంస్థ సృష్టించింది,” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)ను నిషేధించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు.అదే సమయంలో, సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించారని గుర్తు చేశారు.పటేల్, ఇందిరా గాంధీలను దేశ ఐక్యతకు సేవ చేసిన ఉక్కు నాయకులుగా ఖర్గే కొనియాడారు. మరోవైపు, ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ప్రతిస్పందిస్తూ, “దశాబ్దాల పాటు కాంగ్రెస్ సర్దార్ పటేల్ సేవలను ఎందుకు విస్మరించింది?” అని ప్రశ్నించింది.
