తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వయంగా పరిశీలించారు. ఒంగోలులో నీటమునిగిన ప్రాంతాలను కలెక్టర్‌తో కలిసి మంత్రి సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు.
ఒంగోలు జవహర్ నగర్‌లోని నవోదయ విద్యాలయాన్ని పరిశీలించిన మంత్రి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వం ముందస్తు అప్రమత్తతతో ప్రాణ, పశు నష్టాన్ని నివారించగలిగామని మంత్రి తెలిపారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో సాయంత్రం లోపు నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ప్రకాశం జిల్లాలో చెరువులు నిండిపోవడంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయని పేర్కొన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.చెరువులు, వాగుల వద్ద అధికారులు నిరంతరం గస్తీ కాస్తున్నారని, కలెక్టర్ నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు అందరూ కష్టపడి పని చేశారని మంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్ పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు.
