కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తనను “దేశద్రోహి” అని విమర్శించిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి, మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ అజారుద్దీన్, “దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన నేను దేశద్రోహినా?” అని ప్రశ్నించారు. గతంలో వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి న్యాయస్థానం ఇప్పటికే తాను విముక్తి పొందినట్లు గుర్తుచేశారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని బీజేపీ తనపై పాత ఆరోపణలనే తిరగదోడుతోందని ఆరోపించారు. “కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి ఏం తెలుసు? బ్యాట్ అయినా పట్టగలరా?” అంటూ అజారుద్దీన్ ఎద్దేవా చేశారు.మంత్రి పదవిపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, “కాలమే సమాధానం చెబుతుంది” అన్నారు.
Anti-national:“నన్ను దేశద్రోహి అంటారా?” – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అజారుద్దీన్ ఆగ్రహం
