బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో నటి దువ్వాడ మాధురి కేవలం రెండు వారాల తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఈ వారం నామినేషన్లలో తక్కువ ఓట్లు రావడంతో హోస్ట్ అక్కినేని నాగార్జున ఆమె ఎలిమినేషన్‌ని ప్రకటించారు.మాధురి తన ఎలిమినేషన్‌ను ముందే ఊహించానని, భర్త శ్రీనివాస్ పుట్టినరోజు (నవంబర్ 4) సందర్భంగా ఆయనతో ఉండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.హౌస్‌లో ఉన్నవారిని గురించి మాట్లాడుతూ, కల్యాణ్, డిమోన్ పవన్, తనూజను ప్రశంసించారు. మరోవైపు, భరణిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, హౌస్‌లో ఉండేందుకు అర్హత లేదని చెప్పారు.

