సంగీత మాంత్రికుడు ఏ.ఆర్. రెహ్మాన్ ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ చేయబోతున్నారు. ఈ సంగీత వేడుక 2025 నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.
ఈ గ్రాండ్ కాన్సర్ట్‌లో రెహ్మాన్ తన మూడు దశాబ్దాల సంగీత ప్రస్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తన ప్రసిద్ధ భారతీయ గీతాలు మరియు అంతర్జాతీయ కూర్పులను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం అద్భుతమైన లైవ్ మ్యూజిక్, ప్రపంచ స్థాయి ప్రొడక్షన్, మరపురాని అనుభూతితో కూడిన సంగీత రాత్రి ఉండనుంది.
ఈ ప్రత్యేక ఈవెంట్‌ను హైదరాబాద్ టాకీస్ నిర్వహిస్తోంది. టికెట్లు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు [www.ramojifilmcity.com](http://www.ramojifilmcity.com) సందర్శించండి లేదా 76598 76598 నంబర్‌కు కాల్ చేయండి.
