జూన్ 12న అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిన ఎయిర్ ఇండియా గ్యాట్‌విక్ బౌండ్ విమానంలో 241 మంది మరణించగా, వారిలో విశ్వాస్‌కుమార్ రమేష్ (Ramesh) మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన సోదరుడు అజయ్‌కుమార్ ప్రాణాలు కోల్పోయాడు.సీటు 11A, అత్యవసర ద్వారం పక్కన కూర్చున్న రమేష్ విమానం కూలే ముందు బయటకు దూకి బతికిపోయాడు. అయితే ఇప్పుడు ఆయనకు మానసిక భయానక పీడకల గా మారిందని తెలిపారు.ఒక ఇంటర్వ్యూలో రమేష్ మాట్లాడుతూ, సోదరుడిని కోల్పోయిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, వ్యాపారం దెబ్బతిన్నదని, ఇంకా సాధారణ జీవితానికి తిరిగి రావడం చాలా కష్టమవుతోందని వెల్లడించారు.లీసెస్టర్‌లో భార్య, నలుగురేళ్ల కుమారుడు దివాంగ్‌తో నివసిస్తున్న రమేష్, “ఇప్పుడు షవర్ తీసుకోవడానికి కూడా భార్య సహాయం కావాలి. మానసికంగా పూర్తిగా కూలిపోయాను” అని కన్నీటి పర్యంతమయ్యాడు.
ప్రమాదం జరిగిన నెలల తరువాత కూడా ఆయన ఇంకా ఆ PTSD నుంచి బయటపడలేకపోతున్నారు

