కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన “బేటే కి షాది” వ్యాఖ్యకు బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ప్రతిస్పందించారు. “ఖార్గే జీ, కాంగ్రెస్ యువరాజ్ కి షాది చేస్తే మేము తప్పకుండా వస్తాం” అని ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు.
రాహుల్ గాంధీకి ‘యువరాజ్’ అనే పిలుపును బీజేపీ రాజకీయ వ్యంగ్యంగా ఉపయోగిస్తుంది. అందుకే యువరాజ్ పెళ్లి కి వస్తామంటూ సెటైర్లు వేశారు.
మోడీపై చేసిన వ్యాఖ్యలో, “నరేంద్ర మోడీ బీహార్‌లో ఎప్పుడూ తన కొడుకు షాదీ కోసం తిరుగుతున్నట్లే, ప్రతి ఎన్నికలో ఆయన ముఖమే కనిపిస్తుంది” అని ఖర్గే కామెంట్స్ చేశారు. దీనిమీద బిజెపి గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

