తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థలు నేడు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై ఆందోళనకు దిగాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం FATHI బంద్కు పిలుపునిచ్చి, రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి అన్ని ప్రైవేట్ కాలేజీలు మూసివేయబడ్డాయి. బకాయిలు పూర్తిగా చెల్లించేవరకు కాలేజీలు తిరిగి తెరవబోమని సంఘం స్పష్టం చేసింది.
యాజమాన్యులు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది , వందల కోట్ల రూపాయల బకాయిలు వృద్ధి చెందడంతో కాలేజీలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు. సిబ్బంది వేతనాలు, విద్యార్థుల సదుపాయాలు, ల్యాబ్ ఫెసిలిటీల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక కాలేజీలు రుణాలపై నడుస్తున్నాయని వారు వాపోయారు.
FATHI ప్రభుత్వానికి చివరి హెచ్చరికగా నవంబర్ 6న హైదరాబాద్లో లక్షలాది సిబ్బందితో భారీ సమావేశం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకముందే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని యాజమాన్య సంఘం డిమాండ్ చేసింది.

