బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పాసెంజర్ రైలు ఒక నిలిచున్న గూడ్స్ రైలును మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, కొందరు గాయపడ్డారు.
ప్రాధమిక సమాచారం ప్రకారం, మెమూ రైలు బోగీలు సరుకు రైలుపై ఎక్కిపోయేంత తీవ్రతతో ప్రమాదం చోటు చేసుకుంది.ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ఇద్దరు గాయపడ్డారని, నవభారత్ టైమ్స్ ప్రకారం నలుగురు మృతి చెందారని, మరికొందరు గాయపడ్డారని తెలుస్తోంది.
రైల్వే అధికారులు ఈ ఘటనను ధృవీకరించి, సిగ్నల్ వైఫల్యం, వేగం అధికం లేదా ట్రాక్ క్లియరెన్స్ సమస్య కారణమైందా అనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.ఈ ప్రమాదంతో బిలాస్పూర్–కట్నీ రైల్వే మార్గం లో రైలు రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. (ఫ్రైట్–ప్యాసింజర్) ట్రాక్‌లపై భద్రతా ప్రమాణాలు మరోసారి ప్రశ్నార్థకంగా మారాయి.అధికారులు ప్రస్తుతం నష్టం స్థాయి అంచనా వేస్తూ, రైలు సేవలను పునరుద్ధరించే పనులు చేపట్టారు.

