కన్నడ సినిమా ‘KGF’ లో గుర్తుండిపోయే ఛాఛా పాత్రతో అభిమానుల మన్ననలు పొందిన హరీశ్ రాయ్ (Harish Roy) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో యుద్ధం చేస్తున్న ఆయన ఆరోగ్యం ‘KGF-2’ విడుదల తర్వాత క్రమంగా క్షీణించింది.
చివరి దశ కాన్సర్ లో వైద్య చికిత్సకూ ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొన్న ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, ముఖ్యంగా ధ్రువ్ సర్జా (Dhruv Sarja) సహాయం అందించారు. హరీశ్ రాయ్ మరణ వార్తతో అభిమానులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు.

