A.P:తెలుగు తేజం కైవల్య రెడ్డికి అంతరిక్షంలో రెండు విజయాలు

November 7, 2025 12:35 PM

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్య రెడ్డి అంతరిక్ష రంగంలో రెండు విశిష్ట గౌరవాలు సాధించారు.

మొదటిగా, ఆమె అంగారక–బృహస్పతి(Jupiter and mars) గ్రహాల మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్‌లో “2021 CM37” అనే గ్రహశకలాన్ని(asteroid) గుర్తించి రికార్డు సృష్టించారు. ఈ ఆవిష్కరణను ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ సెర్చ్ కొలాబొరేషన్ (IASC) ధృవీకరించింది. కైవల్య పాన్‌స్టార్స్ టెలిస్కోప్ చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో విశ్లేషించి ఈ గ్రహశకలాన్ని కనుగొన్నారు. ఢిల్లీకి చెందిన స్పేస్‌ఫోర్ట్ ఇండియా ఫౌండేషన్లో సమీర్ సత్యదేవ్ వద్ద శిక్షణ తీసుకున్న ఆమె, “గామా టీం” తరఫున ఈ కనుగొనుగులు చేశారు. గతంలో కూడా ఆమె “2020 PS24” గ్రహశకలాన్ని కనుగొని సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా రూ. 1 లక్ష బహుమతి అందుకున్నారు.

ఇక తాజాగా, కైవల్య అమెరికా ఫ్లోరిడాలోని టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహించే ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి(astronaut training) ఎంపికై మరో అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది దరఖాస్తుల్లో కేవలం 150 మంది మాత్రమే ఎంపిక కాగా, వారిలో కైవల్య ఒకరు.శిక్షణ వ్యవధి 4 సంవత్సరాలు అనంతరం 2029లో అంతరిక్ష యాత్రవ్యోమగాములు300 కి.మీ ఎత్తులో 3 గంటలపాటు జీరో గ్రావిటీ అనుభవించనున్నారు.శిక్షణ ఇస్తున్నవారు నాసా మాజీ వ్యోమగామి విలియం మెక్‌ఆర్థర్, బ్రెజిల్ తొలి వ్యోమగామి మార్కోస్ పోంటెస్

17 ఏళ్ల కైవల్య, 2023లో కూడా నాసా ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ (IASP) లో పాల్గొని శిక్షణ పొందింది.

ఆమె తండ్రి శ్రీనివాసరెడ్డి పంచాయతీ కార్యదర్శి, తల్లి విజయలక్ష్మి గృహిణి. భవిష్యత్తులో జర్మనీలో ఆస్ట్రోఫిజిక్స్‌లో ఉన్నత విద్య అభ్యసించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media