నిజామాబాద్ జిల్లా పేకాట (cards)స్థావరాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ సీరియస్ అయ్యారు. జిల్లా బిజెపి నాయకులు పేకాట ఆడుతున్నట్లు తన వద్ద పక్కా సమాచారం ఉందని ఆయన అన్నారు.
పేకాట స్థావరాలను రాజకీయ పార్టీ నాయకులు నడుపుతున్నారని ఎంపీ విమర్శ.బిజెపి నేతలుపేకాట ఆడితే రాజకీయంగా ఎదుగుదలను కోల్పోతారంటూ హెచ్చరిక.జిల్లాలో పేకాట స్థావరాలు మూసివేయాలని, లేకపోతే పోలీసులతో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచన.ఎంపీ ప్రకటనల తర్వాత పేకాట స్థావరాల వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.ఈ వ్యాఖ్యలతో పేకాట పట్ల రాజకీయ వర్గాల్లో వేడి చర్చ మొదలైందని తెలుస్తోంది.

