ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మాట్లాడుతూ, 1937లో ‘వందే మాతరం’ కవితలోని ముఖ్యమైన పద్యాలను తొలగించడం దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న విభజనాత్మక(seperation) మనస్తత్వానికి ప్రతీక అని అన్నారు.
ఆయన గుర్తుచేసిన దాని ప్రకారం, ఈ దేశభక్తి గీతాన్ని బంకిమ్ చంద్ర చట్టర్జీ అక్షయ నవమి (నవంబర్ 7, 1875) నాడు రచించారు,వందేమాతరం రాసి 150 సంవత్సరాలు అవుతుంది. ఈ గీతం భారత స్వాతంత్ర్య సమరంలో అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణగా నిలిచిందని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి, ప్రతి భారతీయుడు విభజనలను అధిగమించి, వందే మాతరం ప్రతిబింబించే ఐక్యతా భావాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
