తెలుగు తమిళ నటి మిర్నాలిని రవి తాజాగా లిమిటెడ్ ఎడిషన్ ‘బ్యాట్‌మాన్ థీమ్’ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఆమె ఆ కారు ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు.
సూపర్ డీలక్స్ సినిమాలో ఎలియన్ పాత్రతో తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన మిర్నాలిని, చాంపియన్, ఎంజీఆర్ మగన్, ఎనిమీ, జాంగో, కోబ్రా,గద్దలకొండ గణేష్ మరియు రోమియో వంటి చిత్రాల్లో నటించారు.
ఇటీవల సినిమాలు రాకపోవడంతో మిర్నాలిని సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు బ్యాట్‌మాన్ థీమ్ కారు కొనుగోలు చేస్తూ “నా దీర్ఘకాల స్వప్నం నెరవేరింది” అని పేర్కొన్నారు.

