దుబాయ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణ, మహిళల క్రికెట్ అభివృద్ధి, దీర్ఘకాలిక వ్యూహాలపై సభ్యులు చర్చించారు.
మహిళల వన్డే ప్రపంచకప్ విస్తరణ 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌కు అద్భుత స్పందన లభించడంతో, రాబోయే టోర్నీని 8 జట్లకు బదులుగా 10 జట్లతో నిర్వహించాలని నిర్ణయించారు.
ఒలింపిక్స్‌లో క్రికెట్2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చడాన్ని బోర్డు ధ్రువీకరించింది. పురుషులు, మహిళలు రెండూ టీ20 ఫార్మాట్లో ఆడనున్నారు.
మహిళా క్రికెట్ కమిటీ భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, కోచ్ అమోల్ ముజుందార్తో పాటు యాష్లే డి సిల్వా, షార్లెట్ ఎడ్వర్డ్స్ వంటి ప్రముఖులు కమిటీలో నియమితులయ్యారు.
అసోసియేట్ దేశాలకు నిధులు పెంపు 2026 నుంచి అసోసియేట్ దేశాలకు 10% అదనపు నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయాలు క్రికెట్ అంతర్జాతీయ ప్రాధాన్యాన్ని పెంచి, మహిళల క్రికెట్‌కు కొత్త ఊపును ఇస్తాయని ఐసీసీ పేర్కొంది.

