తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ అకాల మరణంపై పలువురు నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలిపారు
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు.మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందెశ్రీ మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందెశ్రీని “సాహితీ వనంలోని మహా వటవృక్షం”గా అభివర్ణించారు.మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రి బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌండ్ సంతాపం తెలిపారు.మంత్రి శ్రీధర్ బాబు అందెశ్రీ మరణాన్ని తెలంగాణ సాహితీ, సమాజానికి ఎప్పటికీ పూడ్చలేని లోటుగా పేర్కొన్నారు. ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆయన సాహితీ విశిష్టతకు నిలువెత్తు సాక్ష్యమన్నారు.అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని నేతలు ప్రార్థించారు.


