అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్ భారత్‌లో కొత్త అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. సోమవారం జరగనున్న ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ట్రంప్ స్వయంగా హాజరుకానున్నారు అని వైట్‌హౌస్ ధృవీకరించింది.38 ఏళ్ల వయసులో సెర్గియో గోర్ భారత్‌లో రాయబారిగా పనిచేయనున్నఅత్యంత పిన్న వయస్కుడు అవుతారు. గతంలో ఆయన వైట్‌హౌస్‌లో ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్‌గా సేవలందించారు.
సెనేట్ ఆమోదం పొందిన తర్వాత సెర్గియో మాట్లాడుతూ, “భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి. రక్షణ, వాణిజ్యం, ఇంధన భద్రత రంగాల్లో సంబంధాలను బలోపేతం చేయడం నా లక్ష్యం” అన్నారు.
తాజాగా భారత్ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తదితరులను కలిశారు. “భారత్‌తో అమెరికా బంధం మరింత బలపడుతుంది” అని సెర్గియో విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కూడా ఆయన పదవీకాలంలో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత బలపడుతుందని ఆశాభావం తెలిపారు.

