పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన విందును ఆస్వాదించిన వారిలో ‘ఫౌజీ’ సినిమా నటి ఇమాన్వీ (Imanvi) కూడా చేరారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ఫౌజీ’ షూటింగ్ సమయంలో ప్రభాస్ తన ఇంటి వంటలను ఇమాన్వీకి పంపించారట. రకరకాల రుచికర వంటకాలతో కూడిన ఆ భోజనం చూసి ఆమె మంత్రముగ్ధురాలయ్యింది.
ఇమాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ ఫోటో షేర్ చేస్తూ, “Heart and stomach so so full. Thank you Prabhas garu” అంటూ ప్రభాస్‌కు ధన్యవాదాలు తెలిపింది.

