రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం ఆయన ఒకేరోజులో మూడు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను సందర్శించి రూ.165 కోట్లకు పైగా విరాళాలు ప్రకటించారు.
తిరుమలలో అన్నప్రసాదం ట్రస్టు కోసం ₹100 కోట్లు విరాళంగా ప్రకటించి, ప్రతి రోజు రెండు లక్షల మందికి అన్నదానం అందించే ఆధునిక వంటశాల నిర్మించనున్నట్లు తెలిపారు.రాజస్థాన్ నాథ్ద్వారా ఆలయంలో యాత్రికుల సదుపాయాల కోసం ₹50 కోట్ల విరాళం, తొలి విడతగా ₹15 కోట్ల చెక్కు అందజేశారు.కేరళ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ₹15 కోట్ల తొలి విడత విరాళం ఇచ్చారు.
మూడు రాష్ట్రాల్లో ఒకేరోజు సేవా కార్యక్రమాలకు విరాళాలు ప్రకటించిన అంబానీ చర్య సామాజిక వర్గాల్లో విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది.

