స్వచ్ఛమైన గాలిని కోరుతూ నిరసన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేయడంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని పార్టీ నేతలు పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ప్రభుత్వం వెంటనే వాయు కాలుష్యం నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. “ప్రజలు శుభ్రమైన గాలిని కోరుతున్నారని వారిపై దాడి చేయడం కాదు, వారి ఆరోగ్యం, భవిష్యత్తు రక్షణ కోసం చర్యలు తీసుకోండి” అని ఆయన ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఉత్తర భారతదేశంలో పెరుగుతున్న గాలి కాలుష్య సమస్యను పట్టించుకోవడం లేదని, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు.

