సోమవారం సాయంత్రం 6:52 pm కి ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన కారులో భారీ పేలుడు సంభవించి, కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో ప్రాంతంలో భయం చెలరేగింది మరియు అనేక వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.
పేలుడు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం. 1 సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు నగరవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఏడు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
దిల్లీ అగ్నిమాపక శాఖ ప్రకారం, పేలుడు శబ్దం పరిసర ప్రాంతాల భవనాల కిటికీలు పగిలేంత శక్తివంతంగా ఉన్నట్లు తెలిపారు.


