దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడిన ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. నగర పోలీసులు సోమవారం సాయంత్రం నుంచి హై అలర్ట్ ప్రకటించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద చర్యలు గమనించిన వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాన రహదారులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ ప్రాంతాలు వంటి రద్దీ ప్రదేశాల్లో భద్రతను పెంచారు. వాహనాల తనిఖీలు, రూట్ ఆధారిత చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పహారా వ్యవస్థను బలోపేతం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు పట్రోలింగ్ వాహనాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే నగరవ్యాప్తంగా సీసీటీవీ పర్యవేక్షణను మరింత బలపరిచారు.

ఈ ఫోటో 2013 లో dilsukhnagar బ్లాస్ట్ డి ఆ బ్లాస్ట్ వల్ల జరిగిన నష్టం ఇప్పటికి హైదరాబాద్ ప్రజల్లో ఉంది మల్లి అలంటి విశదం తీసుకోలేము అని పలువురు వాపోతున్నారు,
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, బాంబు నిర్వీణ దళం (BDDS), డాగ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఈ చర్యలు ముందస్తు జాగ్రత్తగా చేపట్టినవని అధికారులు తెలిపారు. ప్రజా భద్రతలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో ఈ సంయుక్త చర్యలు మరోసారి వెల్లడించాయని పేర్కొన్నారు. సిటీ లో 2 రాష్ట్రాలలో పోలీసులు చెక్ పోయింట్ పెట్టి చెక్ చేస్తున్నారు ఈ విష్యం పై కొంచం పబ్లిక్ సహకరించాలి అంటూ పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి .
అధికారులు ఇటీవల గుజరాత్ ఏటీఎస్ డాక్టర్ అహ్మద్ మొయిద్దీన్ సయ్యద్ను ఉగ్ర కుట్రలో ప్రమేయం ఉన్నట్లు అనుమానంతో అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పరిణామాల దృష్ట్యా దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు హై అలర్ట్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు.



