ఈ నెల 19న ప్రధాని నరేంద్రమోదీ, 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తిలో జరగనున్న శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరుకానుండటంతో, పటిష్ట ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
సచివాలయంలో మంత్రులు, సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో సీఎం, భద్రత, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. పుట్టపర్తి పట్టణాన్ని అందంగా అలంకరించి, ప్రధాన ప్రముఖుల రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఇది అంత బూటకం అంటున్నారు పుట్టపర్తి ప్రజలు పుట్టపర్తి లో ట్రాఫిక్ ఏంటి శుభ్రత ఏంటి పుట్టపర్తి మామూలుగానే శుభ్రం గ ఉంచుకుంటాం అంటున్నారు ప్రజలు ప్రతి సంవత్సరం ఈ శతజయంతి ఉత్సవాలు బాగానే చేసుకుంటాం అని మాకు మా బాబా గారు చాల ముఖ్యం అంటున్నారు
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్, రవాణా సౌకర్యాలు కల్పించాలని, అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ముందస్తు జాగ్రత్తగా పుట్టపర్తిలో 10 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని చంద్రబాబు హెచ్చరించారు.


