టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్స్‌కి క్లారిటీ ఇచ్చారు. భార్య రక్షితతో విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో, ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు చెక్ పెట్టాయి.
శర్వానంద్ మాట్లాడుతూ, “తండ్రి అయిన తర్వాత నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు నా కుటుంబం, నా బిడ్డ కోసం ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు.నేను తండ్రిని అయ్యాను మంచి భర్త గ కూడా ఉంటాను నా జీవితం నేను తండ్రిని అయ్యిన దెగ్గరనుంచి మారిపోయింది,2019లో జరిగిన ప్రమాదం తర్వాత తన బరువు 92 కేజీలకు పెరిగిందని, కష్టపడి 22 కేజీలు తగ్గానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత జీవితంపై వస్తున్న ప్రచారాలకు స్పష్టమైన సమాధానంగా మారాయి.
ప్రయోగాత్మక కథలను ఎంచుకునే నటుడు శర్వానంద్ తన కొత్త చిత్రం బైకర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంతో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాను అభిలాష్ కంకరా దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తాజాగా విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రేక్షకులు దీనిని “తెలుగు సినిమా యొక్క F1”గా అభివర్ణించారు. అయితే, తాజాగా విడుదలైన తొలి సింగిల్ ప్రిటీ బేబీ పాట ప్రోమో రొమాంటిక్ డ్యాన్స్ నంబర్‌గా ఉండటంతో, సినిమా చుట్టూ నెలకొన్న హైప్ కొంత తగ్గిందని అంటున్నారు.
టీజర్ ఆధారంగా బైకర్‌ను ఒక గంభీరమైన స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులు ఊహించారు. ముఖ్యంగా శర్వానంద్ ఇండోనేషియాలో ప్రొఫెషనల్ రేసర్లతో నిజమైన రేసింగ్ సన్నివేశాలు చిత్రీకరించామని వెల్లడించడంతో అంచనాలు మరింత పెరిగాయి. పాట ప్రోమోకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల్లో ఈ రేసింగ్ నేపథ్య చిత్రంపై ఉత్సాహం మాత్రం కొనసాగుతోంది.


