అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని దేవగుడిపల్లెలో పేదల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారు హేమలత కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేసి, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హేమలత దంపతులకు సీఎం నూతన వస్త్రాలు బహుకరించారు. అనంతరం లబ్ధిదారు షేక్ ముంతాజ్ బేగం నివాసానికి వెళ్లి గృహప్రవేశం చేసి, నమాజ్‌లో పాల్గొన్నారు. ఆ కుటుంబానికి నూతన వస్త్రాలు అందజేసి, సంక్షేమ పథకాల అమలు గురించి వివరాలు తెలుసుకున్నారు. విదేశంలో ఉన్న ముంతాజ్ భర్త మహమ్మద్ షరీఫ్ వీడియో కాల్ ద్వారా సీఎంను కలుసుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రామ మహిళలను సీఎం ఆప్యాయంగా పలకరించారు.





