Minister narayana :కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన మంత్రి నారాయణ

November 13, 2025 11:51 AM

రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి డాక్టర్ నారాయణ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఈ భేటీలో మున్సిపల్ శాఖకు సంబంధించి కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన నిధుల కేటాయింపు, విడుదల అంశాలపై చర్చించారు.

మంత్రి నారాయణతో పాటు శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమృత్ పథకం, 15వ ఆర్థిక సంఘం కింద పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని ఆయన కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి ప్రతిపాదనలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media