డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన భూకబ్జా ఆరోపణలను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఖండించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న పవన్ వ్యాఖ్యలను తిరస్కరించారు.
మిథున్ రెడ్డి ‘ఎక్స్’లో స్పందిస్తూ — “పవన్ గారు హెలికాప్టర్‌లో చూపించిన భూమి మా చట్టబద్ధమైన సొత్తు, 2000లోనే కొనుగోలు చేశాం” అన్నారు. ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు.
పవన్ చేసిన ఆరోపణలు, మిథున్ రెడ్డి ఇచ్చిన ప్రత్యుత్తరంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.

