మీడియా పేరుతో బ్లాక్మెయిల్ చేయాలనే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. తుళ్ళూరు సీఐ మాతంగి శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి చానల్ రిపోర్టర్ సహకారంతో కుట్ర పన్నినట్లు విచారణలో బయటపడిందన్నారు. తన కార్ అద్దాలు తన వ్యక్తులతోనే పగలగొట్టించి రూ.5 వేల రూపాయలు చెల్లించినట్లు తేలిందని వెల్లడించారు.
ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మీడియా పేరు దుర్వినియోగం చేసి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
