సూపర్‌స్టార్ మహేశ్‌బాబు–ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. రేపు రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సినిమా కీలక అప్‌డేట్స్‌ను ప్రకటించే గ్రాండ్ ఈవెంట్‌కు సిద్ధం అవుతున్నారు.
ఈవెంట్ కోసం చిత్రబృందం ‘పాస్‌పోర్ట్ స్టైల్’లో ప్రత్యేక పాస్‌లను రూపొందించగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పసుపు రంగు కవర్‌పై “GLOBETROTTER EVENT” డిజైన్, త్రిశూలం లోగో, లోపల మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, రాజమౌళి ఫొటోలు, గైడ్‌లైన్స్, మ్యాప్ వివరాలు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పాస్‌ల విషయంలో వస్తున్న రూమర్స్‌పై దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ—పాస్ ఉన్నవారికి మాత్రమే ఈవెంట్‌లో ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సినిమాలో పృథ్వీరాజ్ ‘కుంభ’, ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలి ‘సంచారీ’ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండి సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

