మోలాసిస్ అనేది చెరుకు లేదా బీట్ చక్కెరను నలిపినప్పుడు లభించే గాఢమైన గోధుమరంగు, షుగర్ అధికంగా ఉండే మందమైన ద్రవం. ఇతర మిఠాయిలతో పోలిస్తే ఇందులో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది కూడా అధిక చక్కెరను కలిగి ఉంటుంది.
లైట్ మోలాసిస్ — మొదటి స్టేజ్ తర్వాత లభిస్తుంది; రంగు పలుచగా, రుచి తీయగా ఉంటుంది; బేకింగ్‌లో ఎక్కువగా వాడతారు.
డార్క్ మోలాసిస్ — రెండో స్టేజ్ లో ఉత్పత్తి అవుతుంది; మరింత మందంగా, గాఢంగా, తక్కువ తీపిగా ఉంటుంది.
బ్లాక్‌స్ట్రాప్ మోలాసిస్ — మూడో స్టేజ్ లో అత్యంత మందమైనది, గాఢమైనది, స్వల్పంగా చేదుగా ఉంటుంది.
ఇది సంప్రదాయంగా పశువుల ఆహారంలో, ఎథనాల్, ఈస్ట్, లాక్టిక్ ఆమ్ల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే ఎథైల్ ఆల్కహాల్ ఉత్పత్తిలో కూడా మోలాసిస్‌ను వినియోగిస్తారు.

